telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు స్టే!

polavaram

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ హైకోర్టు ను ఆశ్రయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ సోమవారం నాడు కోర్టును ఆశ్రయించింది. మూడు రోజుల పాటు విచారించిన బెంచ్ ఈ మేరకు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Related posts