telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్లమెంటులో పోలవరం అంశాన్ని లేవనెత్తిన జీవీఎల్

gvl comments on tdp

పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పోలవరం అంశాన్ని లేవనెత్తారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, ప్రాజెక్టుపై రూ.2375 కోట్ల అదనపు వ్యయం చెల్లింపులు చేశామని చెప్పిందని తెలుగులో ప్రస్తావించారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుని మిగతా నిధులు కూడా విడుదల చేయాలని కోరారు.

ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు కేంద్రం సహకరించాలని అన్నారు. ఏపీ ప్రజల ప్రజల కల సాకారం అయ్యేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు అంశంలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి, నిర్వాసితుల అంశాన్ని కూడా పరిష్కరించాలని జీవీఎల్ కోరారు.

Related posts