telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం ఆపేందుకు తెలంగాణ యత్నం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ పోలవరంను నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శరవేగంగా జరుగుతున్నా ప్రాజెక్ట్ పనులు నిలిపివేయడానికి వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. 11వ తేదీన ప్రాజెక్టుపై తనకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టులో గుట్టుచప్పుడు కాకుండా పిటిషన్‌ వేసింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో అప్రమత్తంగా ఉంటున్న ఏపీ జల వనరుల శాఖ ఈ పిటిషన్‌ వివరాలను సేకరించింది.తెలంగాణ పిటిషన్‌లో ముఖ్యంగా మూడు అంశాలను ప్రస్తావించారు.

ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణ భూభాగంలోని జల విద్యుత్తు కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులూ లేవని నిర్ధారించాలని తెలంగాణ సర్కార్‌ కోరింది. ఆయా అంశాలపై అధ్యయన నివేదిక వచ్చేంతవరకూ పోలవరం నిర్మాణం ఆపాలన్నదే దాని ఉద్దేశంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ గతంలో కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేయడం పై ఏపీ నుంచి సర్వత్రా విమర్శలు వెళ్లువిరుస్తున్నాయి.

Related posts