telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నోటీసులు లేకుండా ప్రాజెక్ట్ పనులు ఎలా ఆపేస్తారు: దేవినేని

uma devineni

పోలవరం ప్రాజెక్టు టెండర్లపై ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుపట్టారు.ప్రాజెక్టు విషయంలో తొలి నుంచీ దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు అడ్డుకునే ప్రయత్నానికి తెర తీశారని ఎద్దేవా చేశారు. ఫైనల్ ఎకౌంటు సెటిల్‌ చేసుకునేందుకే పోలవరం పంచాయతీ అని దుయ్యబట్టారు. 

పోలవరం వద్ద వరద ఉద్ధృతిని అంచనా వేస్తున్న సమయంలో 15 రోజుల్లో అకౌంట్ సెటిల్ చేసుకోమనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా పనుల కాంట్రాక్టును రద్దు చేయడం ఏమిటన్నారు. అకారణంగా పనులు నిలిపివేశారని ఆరోపించారు. ట్రాన్స్ ట్రాయ్ నుంచి నిబంధనలకు అనుగుణంగా నవయుగకు పనులు అప్పగించామని వెల్లడించారు. కేంద్ర జలవనరుల శాఖ, నిపుణులు, ఇంజనీర్లు పర్యవేక్షణలో పోలవరం కట్టామన్నారు. అటువంటిది అవినీతి పేరుతో ఎటువంటి నోటీసులు లేకుండా పనులు ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు.

Related posts