telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

టాగ్స్ ఆధ్వరంలో జరిగిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” …

poetry contest for nris

2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికే పరిమితమైన ఈ పోటీలో అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం. టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net) , సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక లోనూ ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం:
“ఉత్తమ కథానిక విభాగం విజేతలు”
1.సీతారామాంజనేయులు – సత్యం మందపాటి (టెక్సాస్, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.మిధిల – మానస చమర్తి (మసాచుసెట్స్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.ప్రేమించిచూడు – ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా) : ($28, ప్రశంసా పత్రం)

కన్సొలేషన్ బహుమతులు గెలిచుకున్నవారు:
1.దైవం అంటే విగ్రహం కాదు నిగ్రహం – రాజశేఖర్ పరుచూరి (కెంటకీ, అమెరికా)
2.సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం – కల్యాణి జీ యెస్ యెస్ (రాక్లిన్, కాలిఫోర్నియా, అమెరికా)

ఉత్తమ కవిత విభాగం విజేతలు:
1.ఆఫ్రికా..ఆఫ్రికా – సీతారామరాజు రాపోలు (దక్షిణాఫ్రికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ఏమి వింతయో : ఉత్పల మాలలు – మల్లేశ్వరరావు పోలిమేర (టెక్సస్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.ముల్లు – మానస చామర్తి (మసాచుసెట్స్, అమెరికా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
కన్సొలేషన్ బహుమతులు గెలిచుకున్నవారు:
1.మాతృదేవోభవ – గంగావర ప్రసాద్ వరకూర్ (డాన్ వెల్లి, కాలిఫొర్నీయా, అమెరికా)
2.వెన్నెల – రాధిక నోరి (ఫ్లోరిడా, అమెరికా)

============================================
“మొట్టమొదటి రచనా విభాగం”

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
1.అద్దం – రవికాంత్ పొన్నాపల్లి (టెక్సస్, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ – సూర్య అల్లంరాజు (మెరీలాండ్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.చిన్ననాటి జ్ఞాపకాలు – రాధ అనుపూరు (ఆస్ట్రేలియా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
1.వట వృక్షం – ఉమాదేవి అద్దేపల్లి (శాన్ హోసే , కాలిఫోర్నియా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.అమ్మ – సూర్య అల్లంరాజు (మెరీలాండ్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారలు అందజేసిన గ్రీట్ వే సంస్థకు టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి వారి కధ, కధానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు [email protected] కు పంపవచ్చును. ధన్యవాదాలు.

భవదీయులు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం:
అనిల్ మండవ (చైర్మన్),
మల్లిక్ సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్),
నాగ్ దొండపాటి (అధ్యక్షులు),
దుర్గ చింతల (కార్యదర్శి),
మోహన్ కాట్రగడ్డ (కోశాధికారి),
రాఘవ చివుకుల (సమాచార అధికారి)
సత్యవీర్ సురభి (సలహామండలి సభ్యుడు)
వెంకట్ నాగం (ట్రస్టీ)
వెంకటేష్ రాచపూడి (కార్యకర్త)
ఈమెయిలు: [email protected]

Related posts