telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ పీఎంవో రగడ.. పోలవరం అవినీతిపై చర్చ అవసరం..

apcm visits polavaram today

ప్రధానమంత్రి కార్యాలయం పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయమై దిగొచ్చింది. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్న విషయం అందరూ చూస్తున్నదే. దానికి అనుగుణంగానే ప్రాజెక్టులో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవటానికి నేరుగా పీఎంవోనే రంగంలోకి దిగింది. పీఎంవో ముఖ్య కార్యదర్శి మిశ్రా నుండి కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ అందింది. దాంతో జల్ శక్తి ఉన్నతాధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖలు రాశారు. ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అవినీతిని బయటపెట్టటానికి నిపుణుల కమిటి వేశారు. రివర్స్ టెండరింగ్ కు కూడా వెళ్ళారు. ఇంతలో ప్రాజెక్టులో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ? ఏ స్ధాయిలో అవినీతి జరిగింది ? అనే విషయాలపై నివేదిక అందించింది. అదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడికి కూడా వివరించారు. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసినపుడు కూడా అవినీతిపై వివరించారు.

దాంతో కేంద్రంలో కదలిక వచ్చినట్లుంది. ఎందుకంటే పోలవరం పనులపై సమీక్ష చేయటం, నిలిపేయటం, రివర్స్ టెండరింగ్ కు వ్యతిరేకంగా కేంద్రం మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వివరాలు కావాలంటూ నేరుగా పీఎంవోనే లేఖరాయటంతో డొంకంతా కదులుతోందనే అనుకోవాలి. నిజానికి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఏటిఎంలాగ వాడుకుంటున్నట్లు ఎన్నికలకు ముందు స్వయంగా నరేంద్రమోడినే ఆరోపించారు. అంటే ఏ స్ధాయిలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారో అందరికీ అర్ధమైపోతోంది. అలాంటిది వివిధ కారణాల వల్ల చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతల స్వరం మారిపోయింది. కానీ జగన్ మాత్రం చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకనే జగన్ పట్టుదలకు చివరకు కేంద్రమే దిగొచ్చినట్లు అనిపిస్తోంది. నాలుగు రోజులు పోతే అన్నీ విషయాలు బయటకు వస్తాయనే వైసిపి అనుకుంటోంది.

Related posts