telugu navyamedia
రాజకీయ

ఈ పార్లమెంటు సెషన్‌ ఎంతో కీలకమైంది..ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియా ద్వారా సందేశం ఇచ్చారు ..కొత్త రాష్ట్రపతి, కొత్త ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించే ఈ ప్రస్తుత సెషన్‌ ఎంతో కీలకమైందని, ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం కూడా అని ప్రధాని పేర్కొన్నారు.

పార్లమెంటులో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలని, సభ్యులందరూ ఉభయసభల్లో లోతుగా ఆలోచించి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

75వ స్వాతంత్ర్యదినోత్సవం నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం నడుస్తున్నదని, ఆగస్ట్ 15, ఇంకా రాబోయే 25 ఏళ్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే సమయంలో, మన ప్రయాణాన్ని, కొలవబోయే కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇదని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఈ సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్న మోదీ.. పార్లమెంట్‌లో చర్చలు, విమర్శలు అర్థవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

Related posts