telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నరేంద్ర మోదీ బయోపిక్ : 23 భాషల్లో ఫస్ట్ లుక్

PM-Narendra-Modi

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఇప్పుడు ప్రధాని మోదీ జీవితం ఆధారంగా సినిమాను నిర్మించేందుకు బాలీవుడ్ లో సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో మోదీ పాత్ర కోసం ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి “పీఎమ్ నరేంద్ర మోదీ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. నరేంద్ర మోదీ లుక్ లో వివేక్ ఒబెరాయ్ బాగా సరిపోయాడు. సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈనెల 2వ వారం నుంచి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ బయోపిక్ లో నరేంద్ర మోడీ సాధారణ జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారు ? ఈ స్థాయికి రావడానికి ఆయన చేసిన కృషి, ఆయనలో ఉన్న పట్టుదల, లక్ష్యసాధన వంటి విషయాలన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

Related posts