telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పడిపోతున్న ప్ర‌ధాని మోడీ రేటింగ్…

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రేటింగ్‌ను దెబ్బ‌కొట్టింది.. కోవిడ్ పెరుగుతూ ఉంటే.. ప్ర‌ధాని మోడీ రేటింగ్ మాత్రం క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది.. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు భార‌త్‌ విల‌విల్లాడుతున్న త‌రుణంలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ప్ర‌ధాని మోడీ రేటింగ్ అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయిన‌ట్టు అమెరికాకు చెందిన ఓ స‌ర్వే సంస్థ త‌న నివేదిక‌లో పేర్కొంది. ప్రంప‌చ‌స్థాయి నేత‌ల పాపులారిటీని నిరంత‌రం ట్రాక్ చేస్తూ ఉంటుంది అమెరికాకు చెందిన డాటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ క‌న్స‌ల్ట్స్… అంతేకాదు.. దానికి సంబంధించిన నివేదిక‌ల‌ను సైతం విడుద‌ల చేస్తుంటుంది.. ఆ సంస్థ తాజాగా పేర్కొన్న నివేదిక ప్ర‌కారం.. ఈ వారంలో భార‌త‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఓవ‌రాల్ రేటింగ్ 63 శాతానికి ప‌డిపోయిన‌ట్టుగా స్ప‌ష్టం చేసింది.. 2019 ఆగ‌స్టు త‌ర్వాత త‌మ సంస్థ ప్ర‌ధాని మోడీ పాపులారిటీని ట్రాక్ చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఇదే అత్యంత క‌నిష్ట రేటింగ్‌గా పేర్కొంది.. కాగా, భార‌త్ నుంచి బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు ప్ర‌ధాని మోడీ.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌ధాని పీఠం ఎక్కిన ఆయ‌న‌.. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో మ‌రిన్ని ఓట్లు, సీట్ల‌ను పెంచుకున్నారు. గ‌త మూడు ద‌శాబ్దాల్లో ఏ ఇండియ‌న్ లీడ‌ర్‌కు సాధ్యం కానీ మెజారిటీని ప్ర‌ధాని మోడీ సుసాధ్యం చేశారు. దాంతో బ‌ల‌మైన జాతీయ నేత‌గా ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్‌కు క‌నీసం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

Related posts