telugu navyamedia
రాజకీయ

ప్ర‌పంచం ఒక గొప్ప వ్య‌క్తిని కోల్పోయింది..ఆమె చూపించిన ఆప్యాయత ఎప్పటికి మరిచిపోలేను

బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-2 (96 )అనారోగ్యంతో స్కాట్లాంట్ లో కన్నుమూశారు. ఆమె గ‌త కొన్నిరోజులుగా పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆరోగ్యం మరింత పాడవటంతో డాక్టర్లు ఆమెను ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులకు డాక్టర్లు సమాచారం ఇచ్చారు.

Queen Elizabeth has an intimate 'bubble' of people she counts on during tough times, insider claims | Fox News

25 ఏళ్ల వయసులో నే క్వీన్ ఎలిజబెత్ జూన్ 2, 1953న బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె కన్నుమూయడంతో ప్యాలెస్ వర్గాలు, పలు దేశాల నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

What are Elizabeth II's titles? – Royal Central

ఈ నేప‌థ్యంలో ఎలిజబెత్ 2 మరణం పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె రాణి గా ఉన్న కాలంలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు

ఎలిజబెత్ 2 మన కాలంలో గొప్ప పాలకురాలిగా గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ఆమె కుటుంబంతోపాటు, బ్రిటన్ ప్రజలు శోక సమయంలో ఉన్నారు’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో హుందాతనానికి, డీసెన్సీకి ఆమె నిలువెత్తు రూపం అని పేర్కొన్నారు.

అంతేకాకుండా బ్రిటన్ లో.. 2015,2018లలో యూకే సందర్శించినప్పుడు రాణి తో జరిగిన సమావేశాల ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు .

Image

ఎలిజబెత్ రాణి 2 చూపించిన ఆప్యాయత, ప్రేమను ఎప్పటికి మరిచిపోలేనని మోదీ అన్నారు. ఆమె మరణం తనను కలచి వేసిందని వివరించారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, యూకే ప్రజలకు తన సానుభూతి అని తెలిపారు

ఇలా జరిగిన ఒక భేటీలో మహాత్మా గాంధీ తన పెళ్లిలో బహుమతిగా ఇచ్చిన రుమాలును నాకు చూపించింది’ అని ఆయన అన్నారు.

30 Powers That Queen Elizabeth II Has That No One Else Does - Queen Elizabeth II Royal Privileges

Related posts