telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

రాంచి నుండి.. యోగ గురూ గా.. మోడీ..

pm modi on yoga day from ranchi

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ప్రభాత్ తారా గ్రౌండ్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ప్రధాని మోదీ రాంచీ చేరుకున్నారు. యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొని యోగాభ్యాసకులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.

యోగాను అంతర్జాతీయంగా గుర్తింపు రావటంతో, జూన్ 21ని యోగ డే గా జరుపుంటున్నాము. ప్రధాని మోడీ కూడా యోగాసనాలను యానిమేటెడ్ వీడియో గా ఒక్కో ఆసనం గురించి ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు. యోగా భారతదేశ ప్రాచీన ఆరోగ్య రహస్యంగా పరిగణించబడింది. అప్పటిలో యోగా విద్య ద్వారానే వేలు, వందల ఏళ్ళు బ్రతికి చూపించారు చాలా మంది. ఇప్పటికి చాలా మంది హిమాలయాలలో అలాంటి వారు ఉన్నారన్నది భారతీయుల నమ్మకం.

ఈ యోగా ను ప్రస్తుత ఆధునిక సైన్స్ కూడా వైద్యశాస్త్రంలో భాగంగా ఉపయోగించడం విశేషం. ఎన్నో దీర్ఘకాలిక రోగాలను యోగాతో నయం చేస్తున్నారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ యోగాను, అంతర్జాతీయంగా నేడు ప్రపంచం అంతా జరుపుకుంటున్నాడంటే, దానివెనుక ఆ శాస్త్రాన్ని నమ్మిన వారి కృషి ఎంతైనా ఉంది. రండి యోగా చేద్దాం, మానసికంగా.. శారీరికంగా ఆరోగ్యంగా ఉందాం.

Related posts