telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

గ్రామసర్పంచులకు .. మోడీ లేఖలు.. వర్షాకాల సూచనలు..

modi an eye on all states

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా దేశంలోని అన్ని గ్రామాల సర్పంచులకు లేఖలు రాశారు. గ్రామాల్లో వర్షాకాలం సమయంలో వర్షపునీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరుతూ సర్పంచులకు లేఖలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని మోదీ సర్పంచులకు వాననీటి సంరక్షణ విషయమై లేఖలు రాశారు. ప్రధానమంత్రి స్వయంగా సంతకం చేసి రాసిన ఈ లేఖలను జిల్లా కలెక్టర్ల ద్వార సర్పంచులకు అందించనున్నారు.

యూపీలోని తన సొంత నియోజకవర్గమైన వారాణసీ పరిధిలోని సోన్ భద్రా గ్రామ సర్పంచుతో పాటు 637 గ్రామాల సర్పంచులకు నీటి సంరక్షణపై ప్రధాని లేఖలు రాశారు. డియర్ సర్పంచ్ జీ అంటూ మోదీ సర్పంచులను సంభోదిస్తూ వాన నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. ప్రతీ నీటి చుక్కను కుంటలు నిర్మించడం ద్వార సంరక్షించుకోవాలని ప్రధాని కోరారు.

Related posts