telugu navyamedia
రాజకీయ వార్తలు

పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటి పడాలి: మోదీ

modi on jammu and kashmir rule

పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటి పడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన సదస్సను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పారదర్శకతతో కూడిన సులభతరమైన వాణిజ్య వాతావరణం, సరళమైన నిబంధనలు ఉండాలని మాత్రమే పారిక్రశామివ్తేలు కోరుకుంటారని అన్నారు.

పారదర్శకతతో కూడిన సులభతరమైన వాణిజ్య వాతావరణం, సరళమైన నిబంధనలు ఉండాలని మాత్రమే పారిక్రశామివ్తేలు కోరుకుంటారని చెప్పారు. ఉచిత విద్యుత్తు, తక్కువ ధరకు భూములు, పన్నురాయితీలు కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సులభతర వాణిజ్య వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు పోటి పడాలి తప్ప ఉచితాలు, రాయితీలు ఇవ్వడంలో కాదన్నారు. రాయితీలు ఇవ్వడంలో పోటి పడటం ద్వారా తమ రాష్ట్రానికి, పరిశ్రమలకూ ఎలాంటి ఉపయోగం ఉండదని ఈ విషయాన్ని రాష్ట్రాలు కూడా గుర్తిస్తున్నాయని మోదీ తెలిపారు.

Related posts