telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

కూటమి పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర: మోదీ

modi campaign in mahaboob nagar

విపక్ష కూటమిలో ఉన్న పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని తేని ప్రాంతంలో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుండడం చూసి విపక్ష కూటమి ఓర్వలేకపోతోందన్నారు.

తమిళనాడులో డీఎంకేతో కలిసి ఏర్పాటైంది ఓ మహాకల్తీ కూటమి అని మోదీ విమర్శించారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తే కూటమిలోని ఇతర నేతలు అంగీకరించడంలేదన్నారు. ఆ కూటమిలో అందరూ ప్రధాని అవ్వాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ తో ఆ పార్టీలన్నీ జట్టుకట్టాయని విమర్శించారు. “ఇప్పుడు న్యాయం జరుగుతుంది” అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

Related posts