telugu navyamedia
సినిమా వార్తలు

మోడీ బయోపిక్ కు ఈసీ బ్రేక్

PM-Narendra-Modi-Biopic

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ “పిఎం నరేంద్రమోదీ”. ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ భారతీయ జనతా పార్టీకి లబ్ది చేకూరేలా, ప్రజలను ప్రభావితం చేసేలా ఉందని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు వేసిన పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీమ్‌ కోర్టు కొట్టివేసింది. తాజాగా ఈ చిత్రం విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాను పోలింగ్ ముగిసే మే 19 వరకూ విడుదల చేయరాదని ఆదేశిస్తూ ఈసీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖతో పాటు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ ను జారీచేసింది. పీఎం నరేంద్ర మోదీ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోదీ పాత్రలో నటించారు. ఈ సినిమాను రేపు విడుదల చేయాలని నిర్మాత సందీప్ సింగ్ భావించినప్పటికీ ఈసీ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేపటి నుంచి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో జరగనుంది.

Related posts