telugu navyamedia
రాజకీయ

సికింద్రాబాద్‌ ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్ర‌ధాని సంతాపం ప్రకటించారు.

ఈ ప్రమాదంలో కొంత మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు..

ఇదిలావుంటే రూబీ లాడ్జ్‌ అగ్ని ప్రమాద ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జ్‌ ఓనర్ రంజిత్‌సింగ్‌ బగ్గాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బిల్డింగ్ అనుమతులు, బైక్స్‌ షోరూం, లాడ్జ్‌ నిర్వాహణ అనుమతులపై ఆరా తీసుకున్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పరిశీలిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

బైక్‌ బ్యాటరీ పేలుడు, షార్ట్‌ సర్క్యూట్‌ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మ‌ృతి చెందారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అపోలో, యశోద, గాంధీలో వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో రూబీ లాడ్జ్‌లో మొత్తం 25 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Related posts