telugu navyamedia
రాజకీయ

కృష్ణంరాజు మృతి చెందడం ఎంతో బాధాకరమని.. ఆయన సినిమాలు రాబోయే తరానికి మార్గదర్శనం

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ యూవీ కృష్ణం రాజు గారి మరణం నాకెంతో బాధ కలిగించింద‌న్నారు . ఈసందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.

PM Modi, Amit Shah mourn demise of veteran actor Krishnam Raju - The Illustrated Daily News

ఆయన నటన, ప్రతిభను రాబోయే తరానికి మార్గదర్శనం అన్నారు. రాజకీయ నాయకుడిగానూ ఆయన సేవలు ఆదర్శంగా ఉంటాయని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారు. కృష్ణంరాజు ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. అద్భుతమైన నటుడు, సమాజ సేవతో సైతం ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అమిత్ షా అన్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటునువ మిగిల్చిందన్నారు.

Union Minister Amit Shah, Others Condole Tollywood Actor Krishnam Rajus Death | Krishnam Raju Death News: కృష్ణంరాజు మరణంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

రెబల్​ స్టార్​ కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. “కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమైన విషయం” అంటూ ట్వీట్​ చేశారు

అలాగే కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణం చాలా విచారకరం. సినిమాల్లో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు’ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

Related posts