telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆశ్చర్యపరిచిన మంత్రి ప్రసంగం : .. ఇక్కడ పుట్టింది అంతే.. కానీ దేశం పట్ల యెంత అవగాహన ..

pm impressed with mp speech

ఆమె దేశాన్ని పట్టి పీడిస్తున్న ఏడు సమస్యల గురించి చట్టసభలో లేవనెత్తారు. అధికార పక్షానికి చెందిన కొందరు ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ తనదైన శైలిలో వారికి సమాధానం చెప్పి వారిని శాంత పరిచారు. దేశంలో నిరంకుశ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ ఆమె తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దేశంలో నెలకొన్న ఏడు సమస్యల గురించి వివరించారు. అందులో ‘దేశాన్ని విభజించాలనే కోరిక’,‘ మానవ హక్కులను కాలరాయడం’, ‘మీడియా స్వేచ్ఛను హరించడం’,‘ భయానక వాతావరణాన్ని సృష్టించడం’, ‘ పౌరసత్వ వివాదం’, ‘కళలను, మేధావులను అణచి వేయడం’, ‘ ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోతుండటం’ వంటి సమస్యలను ఆమె లేవనెత్తారు. ఏళ్లపాటు అధ్యయనం చేసిన స్కాలర్‌లాగా ఆమె వాటి గురించి చక్కగా వివరించారు.

ఆమె భారత్‌లో పుట్టారు, పెరిగిందంతా అమెరికాలోనే. చదువు మొత్తం పెద్ద పెద్ద బిజినెస్‌ స్కూళ్లలో సాగింది. కానీ భారత్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఎంతలా అంటే స్వదేశంలోని సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేశారు. ఇక్కడ ఏయే విభాగాల్లో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి..వాటి వల్ల ఎవరు నష్టపోతున్నారనే అంశాలపై పూర్తి అవగాహన ఉంది. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ చట్ట సభలో ఆమె ప్రసంగానికి అధికారపక్షమే ఆశ్చర్యపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ వంటి అగ్రనేతలే ప్రశంసించారు. ఆమే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా.

Related posts