telugu navyamedia
political telugu cinema news trending

ప్లేట్ మరియు చడ్డీ తమ ఎన్నికల గుర్తులట .. : ఆలియా భట్, ధావన్

plate and chaddi as symbols of alia and dhavan

తన రాజకీయ పార్టీ గుర్తేంటో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చెప్పేశారు. ఆమె పాలిటిక్స్ లోకి ఎప్పుడు వచ్చిందని అనుకుంటున్నారా? రాజకీయాల్లోకి రాలేదుగానీ, వస్తే మాత్రం ‘ప్లేట్’ను తన గుర్తుగా ఎంచుకుంటానని చెప్పింది. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న ఆమె, ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్లినా రాజకీయాల ప్రస్తావన వస్తోందని, మీడియా కూడా ఇవే ప్రశ్నలు వేస్తోందని చెప్పిన ఆమె, ‘ప్లేట్’ గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదని, జీవితంలో ప్లేట్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం తాను నటించిన ‘కళంక్’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె ఈ షోలో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంది. ఇక ఆలియా భట్ కే వేసిన ప్రశ్నను వరుణ్ ను అడుగగా, తాను ‘చెడ్డీ’ని గుర్తుగా ఎంచుకుంటానని చెప్పడంతో, వీక్షకులంతా నవ్వుల్లో మునిగిపోయారు. కాగా, ఆలియా, వరుణ్ లతో పాటు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్ కపూల్ తదితరులతో నిర్మాత కరణ్ జోహార్ ‘కళంక్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా టీజర్, ట్రయిలర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Related posts

బన్నీతో గొడవ… స్పందించిన సాయి ధరమ్ తేజ్

vimala p

ఏ్రప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న‌ బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, తేజ కాంబినేష‌న్ చిత్రం `సీత’

ashok

తప్పని పరిస్థితుల్లో అంబేడ్కర్‌కు భారతరత్న:  ఒవైసీ

ashok