telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నల్గొండ జిల్లా.. అంగన్వాడీ కేంద్రంలో .. ప్లాస్టిక్ గుడ్ల కలకలం..

plastic eggs found in nalgonda anganwadi

నల్గొండ జిల్లాలో ని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఇచ్చే గుడ్లను ప్లాస్టిక్ విగా గుర్తించారు తల్లిదండ్రులు. దానితో అధికారులు పరుగున వచ్చి, విషయం అడిగి తెలుసుకున్నారు. కొందరు స్వార్థపరుల వలన ప్రభుత్వం ఎంతో ఉన్నతంగా పరిపాలన అందించాలని ప్రవేశపెట్టిన పథకాలు దారితప్పుతున్నాయని, అటువంటి వారివలన ప్రభుత్వం తలదించుకోవాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.

అయితే పసిపిల్లలకు నాణ్యతలేని ఆహారపదార్దాలు ఆడించడం దారుణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పిల్లలకు పౌష్ఠిక ఆహారం పెట్టకపోగా, వారి ఆరోగ్యానికి ప్రాణాంతకమైనవి తెచ్చిపెడుతుండటం అమానుషమని విమర్శించారు. కాంట్రాక్టు తప్పుదోవలలో, అర్హత లేనివారికి దక్కాయి కనుకే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని వారు అన్నారు. అధికారుల అండదండలతోనే ఈ బాగోతం సాగుతుందని ఘాటు విమర్శలు చేశారు.

Related posts