telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పక్కా స్కెచ్ తోనే .. అఘాయిత్యం .. : సీపీ సజ్జనార్

రాష్ట్ర రాజధాని శివార్లలో పశువైద్యురాలిని గుర్తు తెలియని దుండగులు అపహరించి.. ఆపై అత్యాచారానికి ఒడిగట్టి ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దహనం చేసిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై.. సీపీ సజ్జనార్ ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రియాంక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 27వ తేదీ రాత్రి 11 గంటలకు శంషాబాద్ పోలీసులకు యువతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు వచ్చిందని.. వెంటనే కేసు నమోదు చేసుకుని.. పోలీసులు యాక్షన్‌లో దిగారన్నారు. అప్పుడే.. శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ డెడ్‌బాడీని గుర్తించినట్టు.. న్యూస్ వచ్చిందని.. దీంతో ప్రియాంక తల్లిదండ్రులను పిలిచి డెడ్‌బాడీని.. గుర్తించమనగా.. అది వారి కూతురుదేనని చెప్పారు. దీంతో.. కేసును మరింత సీరియస్‌గా తీసుకుని.. 10 పోలీసు బృందాలు రంగంలోకి.. దర్యాప్తు చేసినట్టు సజ్జనార్ చెప్పారు. నిందితులను మహ్మద్ ఆరీప్ (26), జొల్లు శివ (20), జొల్లు నవీన్ (20), చెన్నకేశవులు(20)గా గుర్తించామని.. వెంటనే వారిని అరెస్ట్ చేశామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా.. వారికి త్వరగా కేసు పడేలా చేస్తామని అన్నారు సజ్జనార్.

బుధవారం రాత్రి ప్రియాంక నోరు, ముక్క నొక్కిపెట్టి ఆరీఫ్ హత్య చేశాడని సీపీ చెప్పారు. ప్రియాంక బైక్ పార్క్ చేస్తున్న సమయంలో నిందితులు అక్కడే ఉన్నారు. ప్రియాంక బైక్‌ని నవీన్ పంక్చర్ చేశాడని.. శివ అనే వ్యక్తి.. దగ్గరలో మెకానిక్ షాపు ఉంటే.. తీసుకెళ్తానంటూ.. చెప్పగా.. ప్రియాంక ఇన్నోసెంట్‌గా నమ్మడంతో.. ఇదే అదునుగా భావించిన మహ్మద్ ఆరీఫ్.. ప్రియాంకను లాక్కెళ్లి.. మద్యం తాగించి.. అత్యాచారం సమయంలో.. ఆమెను గొంతు, ముక్కు నొక్కిపెట్టి.. హత్య చేసి.. ఆపై దుబ్బటి కప్పి.. చెటాన్ పల్లి సమీపంలో ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టి.. మళ్లీ మృత దేహం కాలిందా లేదా అంటూ.. వెనక్కి వచ్చి చెక్ చేసుకున్నారని.. సీపీ సజ్జనార్ ప్రెస్‌ మీట్‌లో వివరించారు. నిందితులంతా.. పక్కా స్కెచ్‌తో ప్లాన్ చేశారని అర్థమవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు.. వెంటనే.. డయల్ 100కి ఫోన్ చేయాలని.. 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి వస్తారని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా.. మహిళలు జాగ్రత్తలు పాటించాలని సీపీ పేర్కొన్నారు.

Related posts