telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానం సీటు కింద పడుకుని ప్యాసెంజర్ ప్రయాణం…!?

Passenger

సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ప్రయాణ సమయంలో కాళ్ల నొప్పులు, నడుము పట్టేయడం, వీపు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చినప్పడు చాలామంది ప్రయాణికులు సీట్లో నుంచి లేచి అటూ ఇటూ తిరుగుతారు. అయితే ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించాడు. విమానంలో ప్రయాణిస్తున్న అతడు.. చాలాసేపు సీట్లో కూర్చోవడంతో నడుం నొప్పి వచ్చింది. దీంతో ఖాళీగా ఉన్న రెండు సీట్ల కింద ఏకంగా పడుకున్నాడు. ఇది ఏ విమానంలో జరిగిందో తెలియదుగానీ.. దీనికి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలైపోయింది. ఈ ఫొటోపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు అతని తెలివిని మెచ్చుకుంటున్నారు. విమానంలో సీట్ల కింద చాలా చెత్త ఉంటుందని, అలాంటి ప్రాంతంలో అతను పడుకున్నాడని తిట్టిపోస్తున్నారు. అయితే ఈ ఘటన ఏ విమానంలో జరిగిది? అతనెవరు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

Related posts