telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రెగ్నన్సీ అంటూ విమాన సిబ్బందికి దొరికిపోయిన ఇంస్టాగ్రామర్… ఏం చేసిందంటే ?

Passenger

ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా ఆండ్రూస్ అనే ఓ ఇన్‌స్టాగ్రామర్.. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ బయలుదేరింది. విమానం ఎక్కేముందు తన వస్తువలన్నింటినీ తన దుస్తుల్లో దాచేసుకుంది. చార్చర్ల వంటి వాటిని పొట్ట దగ్గర పెట్టుకొని, గర్భవతిలా నటించింది. ఆ తర్వాత విమానం ఎక్కి టికెట్ కిందపడటంతో ముందుకు వంగి దొరికిపోయింది. ఎందుకంటే ముందుకు వంగినపుడు ఆమె వీపుమీద ఉన్న ల్యాప్‌టాప్ విమాన సిబ్బంది కంటపడింది. రెబెకా అసలెందుకీ పని చేసిందో తెలుసా? బ్యాగేజ్ ఫీజు తప్పించుకోడానికి. ఆస్ట్రేలియాలో విమాన ప్రయాణికులు తమతోపాటు కేవలం 7కేజీల బరువున్న వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి. అంతకన్నా ఎక్కువ బరువుండే వస్తువులు తీసుకెళ్లాలంటే 31యూరోలు(రూ.2400పైగా) బ్యాగేజ్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును తప్పించుకోవడం కోసమే రెబెక్కా ఈ పద్ధతి ఎంచుకుంది. అయితే ఆమె టైం బాగోలేక విమానంలో ఎక్కగానే ఆమె దొరికిపోయింది. దీని గురించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చెప్పిన రెబెక్కా.. ‘ఈ పని చేస్తూ మీరెవరైనా దొరికిపోతే నా పేరు చెప్పకండి’ అంటూ వీడియో ముగించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Related posts