telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ పండు వల్ల విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…!?

PLane

కెనడాలోని మోంట్రియల్ నుంచి వాంకూవర్ వెళ్తోందా విమానం. దానిలో కొందరు ప్రయాణికులు విమాన సిబ్బందిని పిలిచి ‘ఇక్కడేదో ఇబ్బందికరమైన కంపు కొడుతోంది..’ అంటూ ఫిర్యాదులు చేశారు. దాంతో పరిసరాలను పరిశీలించిన సిబ్బంది.. నిజంగానే దుర్గంధం వస్తుండటంతో షాకయ్యారు. ఆ వాసన ఎందుకు వస్తుందా అని ఆరాతీయగా.. విమానం కార్గోలో ఉన్న డ్యూరియన్ పండు వల్లే ఆ కంపు వస్తోందని తేలింది. విషయం తెలుసుకున్న పైలట్.. విమానాన్ని వెనక్కి మళ్లించి మోంట్రియల్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ పండు తీసేసిన తర్వాతే విమానం బయలుదేరింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పండే ఈ డ్యూరియన్ పండును.. ‘కింగ్ ఆఫ్ ఫ్రూట్స్’ అంటారు. ఎంతో రుచిగా ఉన్నాసరే దీని కంపును భరించడం మాత్రం కష్టమని ఆహారప్రియులు చెప్తారు. అందుకే చాలా ఆసియాదేశాల్లోని రెస్టారెంట్లు ఈ పండు వినియోగంపై నిషేధం విధించాయి కూడా.

Related posts