telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

“పిట్ట రాయబారం”…

pitta rayabaram poetry corner
ముద్దులొలికే పిట్టా!
విరహ వేదన తీరేదెట్టా!
విరహపు కుంపటిలోంచి
బయట పడేదెట్టా?!
ప్రేమ బాణాలు 
నా గుండెల్లో గుచ్చి
వలపుల చూపుల సూదులతో 
 నిలువెల్లా పొడిచి
ప్రేమబాటల్లో అనుక్షణం నడిచి
చిరునవ్వుల పువ్వుల
 పరిమళాలు మదిలో నింపి
అనివార్య పరిస్థితులలో
ప్రణయ లోయలో నన్ను
ఒంటరిగా విడిచి
వెళ్లిన నా ప్రియ సఖికి
“నూతన సంవత్సరం-2019”
శుభాకాంక్షలు 
 చెలి చెవిలో చెప్పిరావా!
 నా గుండె బాధ విప్పిరావా!
తీపికబురు తీసుకుని రావా!!
ప్రియురాలికి నా..
 “ప్రేమ సందేశం” చేరవేయవా!!
ప్రేమ రాయబారిగా 
ప్రేమికులను కలుపు పిట్టమ్మా! 
 నా మొర వినువమ్మా!
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts