telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పావురాళ్ళతో… ప్రమాదం.. వ్యాపిస్తున్న వైరస్, ఇన్ఫెక్షన్లు..

pigeons spreading infections

కొన్ని చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటిని ప్రత్యక్షంగా తాకితే ప్రమాదం తప్పదు. ఆ కోవకే పావురాళ్ళు వస్తాయంటున్నారు నిపుణులు. అవి చూడటానికి చక్కగా ఉన్నప్పటికీ, అనేక రకాల వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి ముఖ్య కారణం అవుతున్నాయని వారు అంటున్నారు. వాటి రెక్కలు, ఈకల నుంచి మొదలుకొని రెట్ట వరకూ ప్రతిదీ ప్రమాదకరమే అని చెప్పాలి. చారిత్రక భాగ్యనగరంలో ఈ శాంతి కపోతాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వాటి సంఖ్య 6 లక్షలకు చేరువైంది. అతి త్వరలోనే ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకోనుంది. హైదరాబాద్ వాసులు ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తెలుపుతున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో గుర్తించడానికి ప్రాఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగ అధిపతి డాక్టర్‌ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారిగా అధ్యయనం నిర్వహిస్తుంది.

పావురాలతో ప్రజలు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. వాటి విసర్జితాలు మరింత ప్రమాదకరం. పావురాలతో ప్రధానంగా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటి వల్ల చర్మం, నోరు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఉదరకోశం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. హైదరాబాద్‌లో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల రావడం ఖచ్చితం అని నిపుణులు తెలుపుతున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా కూడా విడుదల చేసిన అధ్యయన నివేదిక కూడా హెచ్చరికలు జారీ చేసింది. పావురాల విసర్జితాల నుంచి ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటి వల్ల 15 రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అని నిపుణులు అధ్యయనంలో వెల్లడైంది.

Related posts