telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తగ్గిన పెట్రోల్ ధరలు…

petrol bunk hyd

రోజూ పెరుగుతూ ఆల్ టైం హైరికార్డును సృష్టిస్తున్నాయి చమురు ధరలు.. ఇప్పటికే రాజస్థాన్ లాంటి రాష్ట్రం ప్రజలపై భారం పడకుండా కాస్త ఉపశమనం కలిగించాయి.. తాజాగా.. ఇంధన ధరలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ప్రజలకు తీపికబురు చెప్పింది.. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.1 తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా వెల్లడించారు.. అర్ధరాత్రి తర్వాత లీటర్ పెట్రోల్, డీజిల్ రూపాయి చవకగా దొరుకుతుందని తెలిపారు. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండడంతో.. పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఒక రూపాయి ట్యాక్స్‌ను తగ్గించినట్టు పేర్కొన్నారు. కాగా, కోల్‌కతాలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర 91.78 రూపాయలు ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ .84.56గా ఉంది. మరోవైపు.. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకముందే.. కేంద్ర ప్రభుత్వంపై విరిచుకుపడ్డ మమతా… ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను తగ్గిస్తుందంటూ ఎద్దేవా చేశారు. చూడాలి మరి ఈ ధరలు మళ్ళీ ఎప్పటికి తగ్గుతాయి అనేది.

Related posts