telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

బడ్జెట్ దెబ్బకి … ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరలు.. ఇక దిగవట..!

petrol prices in marktets

నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పెట్రో ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించడంతో, పెట్రోలు, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రోజూ పైసల్లో మారే ధర నేడు రూపాయల్లో మారింది. పెట్రోలు, డీజిల్ మధ్య ధరా వ్యత్యాసం కూడా తగ్గిపోయింది.

ప్రస్తుతం దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.96కు చేరుకుంది. శుక్రవారం నాటి ధరతో పోలిస్తే ఇది రూ. 2.45 అధికం. ఇదే సమయంలో డీజిల్ ధర రూ. 2.36 పెరిగి రూ. 66.69కి చేరింది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.04కు, డీజిల్ రూ. 71.82కు పెరిగింది.

గుంటూరులో పెట్రోలు ధర రూ. 77.24కు, డీజిల్ రూ. 72.02కు చేరుకుంది. పెరిగిన పెట్రోలు ధరలు తమపై పెనుభారమేనని వినియోగదారులు వాపోతున్నారు.

Related posts