Trending Today రాజకీయ వార్తలు వార్తలు

90లు దాటిన పెట్రో ధరలు…

petrol and diesel prices

దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు పెరుగుదలే తప్ప తగ్గే సూచనలు ఎక్కడ కనిపించడం లేదు. ఒకపక్క కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏమి చేయలేమని చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక ఎవరు ఈ సమస్యను తీర్చగలరో తెలియడం లేదు కానీ, మొత్తానికి సామాన్యులపై మాత్రం వడ్డన మూలిగేవాడిమీద తాటి పండు పడ్డ చందానే ఉంది. ఏదో ఒకటి చెప్పి సామాన్యుడి బ్రతుకు బరువు చేసేట్టుగా నిత్యావసర సరుకుల నుండి ప్రతిదాని ధరలు పెంచుతున్నారు తప్ప…తగ్గే ప్రసక్తి ఎక్కడ కనిపించడం లేదు.

ఇక ఇంధనం ధర అయితే వామ్మో 80 దాటుతుందేమో అనుకునే లోపే 80లు దాటి 90లు దాటేస్తూ..మహా అయితే మరో నెలలో సెంచరీ కొట్టేట్టుగానే ఉంది. ఇప్పటికే దేశంలోనే కొన్ని చోట్ల 90లు దాటేసింది. ఇక వంద చేరుకోవటానికి పెద్ద సమయం పట్టేట్టుగా లేదు. నేడు కూడా పెరుగుదలతోనే మొదలైన ఇంధన ధరలు..లీటర్ పెట్రోల్ ధర ముంబై లో 90.08 రూపాయలు, ఇక ఢిల్లీలో 82.72, కలకత్తాలో 84.54, చెన్నై లో 85.99 గా ఉంది. డీజిల్ పరిస్థితి కూడా అంతే ఉంది. ముంబై లో 78.58, ఢిల్లీలో 74.02, కలకత్తాలో 75.87, చెన్నైలో 78.26 గా ఉంది. బ్యారెల్ చమురు ధరలు తగ్గుముఖం పట్టిన గతంలో ఈ ధరలు ఇలా పెరుగుతూనే ఉన్న సంఘటన తెలిసిందే. ఇక ఎలాగూ ఓడిపోతాం అని నిర్ణయించుకున్న ప్రభుత్వం కూడా ధరల తగ్గింపుకు ఏమి చేయకుండా ఉందికాబోలు. 

Related posts

మరో భారీ పథకం..తెరాస?

admin

రధ సారధులు…

chandra sekkhar

ఈ వారం ఎలిమినేషన్ అబ్బాయిలకే…

jithu j

Leave a Comment