telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

పెరుగుతున్న .. పెట్రో మంటలు.. 75 దాటేస్తుంది..

petrol prices in marktets

గతంలో ఎన్నికల సందర్భంగా తగ్గించారో.. మరో దానివలనో మొత్తానికి పైసాపైసా చొప్పున ఇంధన ధరలు తగ్గాయి. ఈ తరహా తగ్గుదల కాస్తా అదే విధంగా పెరుగుతూ వచ్చింది. అదికూడా ఎన్నికల అనంతరం. ఈ పెరుగుదలతో మళ్ళీ పెట్రోల్ ధరలు 75 రూపాయలు దాటేసింది. మళ్ళీ 80లు చేరుతుందేమో అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ సమస్యకు ఏ చిట్కా అమలు చేస్తుందో చుడాలిమరి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం నేడు రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.91కి చేరగా… లీటర్ డీజిల్ ధర రూ.66.11కి చేరింది. ఇక ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.54గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.69.23కి చేరింది. కోల్ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.01గా ఉండగా.. చెన్నైలో రూ.73.61కి చేరింది. డీజిల్ ధర కోల్ కత్తాలో రూ.67.89గా ఉండగా.. చెన్నైలో రూ.69.84కి చేరింది. గతేడాది చివరితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరపై రూ. 2.05, డీజిల్‌ ధరపై రూ. 3.25 పెరిగింది.

Related posts