telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

13 రోజుల్లో పెట్రోలు ధర..లీటరుకు రూ.7.11 పెంపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 13వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 56 పైసలు, డీజిల్‌పై లీటరుకు 63 పైసలు పెరిగాయి. 13 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.11, డీజిల్‌ ధర రూ.7.67 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.78.37కి, డీజిల్ ధర రూ. 77.06కి చేరింది.

ముంబై మహానగరంలో పెట్రోలు లీటరుకి రూ.85.21కి, డీజిల్‌ 75.53కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.82, డీజిల్ ధర రూ.74.77గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.80.13, డీజిల్ ధర రూ.72.53కు చేరుకుంది. 

Related posts