Trending Today రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సామాజిక

పెట్రోలు ధరే అనుకుంటే ఇప్పుడు…డీజిల్ కూడా…సెంచరీ కొట్టేనా…!

petrol and diesel prices in markets

మొన్నమొన్నటి దాకా పెట్రోల్ ధరలు పెరిగిపోతాయేమో… ఎనభైలు దాటుతాయేమో.. అని వినియోగ దారులు ఒకటే ఆందోళనకు గురయ్యేవారు. కానీ అది కాస్తా 85 కూడా దాటిపోతుంది. ఇక డీజిల్ అన్నా వాడుకుందాం అనుకునే వినియోగదారుడి నడ్డి విరిగినట్టు దాని ధర కూడా ఎన్నడూ లేనివిధంగా 80 లు చేరుతుంది. ఇలా అయితే ఇక చమురు వాహనాలు మూలానపడేసి ఎంచక్కా ఎలక్ట్రిక్ వాహనాలు నడుపుకోవాల్సిందే. బహుశా ప్రభుత్వం కూడా ప్రజలను అలాంటి దారి మళ్లించడానికే ఎన్నడూ లేనివిధంగా ఇలా చమురు ధరలు పెంచేస్తుందా.. అన్న సందేహం కూడా వస్తుంది.

శుక్రవారం పెట్రోల్ ధర లీటరుకు 48పైసలు, డీజిల్ 47 పైసలు పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ 79.99 కి చేరుకోగా, డీజిల్ ధర లీటరుకు 72.07 గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ 87.39 కాగా, డీజిల్ 76. 51గా ఉంది. ఒక్క ఆగష్టు నెల 16 – 31 వరకు పెట్రోల్ 2.85 రూపాయలు, డీజిల్ 3.3 రూపాయలు పెరిగాయంటే.. ఇది ఎక్కడివరకు వెళ్తుందో..మరో రెండు నెలలలో ఇంధన ధరలు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర మాట్లాడుతూ చమురు ధరలు కూడా జి.ఎస్.టి పరిధిలోకి తేవాల్సిందే అంటున్నారు. చిదంబరం మాట్లాడుతూ, పన్నులు తగ్గిస్తే ధర వాటంతట అవే తగ్గుతాయని అన్నారు.

Related posts

హరిబాబు "రాజీ"నామా

admin

తెరాస కు … ఒవైసీ హెచ్చరిక.. ఆ సీటు మర్యాదగా మాకే…

chandra sekkhar

మర్స్క్ షిప్ లో అగ్నిప్రమాదం

admin

Leave a Comment