telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

నేడు పెరిగిన పెట్రో ధరలు…

petrol bunk hyd

వరుసగా రెండో రోజు ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. దాంతో భారత్‌లో పెట్రో ధరలు రోజుకో కొత్త రికార్డు తరహాలో పెరిగిపోతూనే ఉన్నాయి.. రోజువారి పెంపులతో ఆల్‌టైం హై రికార్డులు సృష్టిస్తున్నాయి… దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి రూ.85 మార్క్‌‌‌‌ను దాటేసింది పెట్రోల్‌ ధర.. ఇక, డీజిల్ రేటు కూడా రికార్డు గరిష్టానికి దగ్గరైంది.. తాజాగా, పెట్రోల్, డీజిల్ ధరను లీటరుపై 25 పైసలు చొప్పున వడ్డించాయి ఆయిల్ సంస్థలు.. దీంతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.20కు చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.75.38కు పెరిగింది.. ఇక, ముంబైలో పెట్రోల్ రూ.91.80, డీజిల్‌ రూ.82.13కు చేరుకొని ఆల్‌టైం హై రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్‌‌‌‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.88.63గా ఉంటే.. 27 పైసలు పెరిగి లీటర్‌ డీజిల్‌ ధర రూ.82.26కు చేరింది. అయితే, బుధవారం పెట్రోల్ ధరలు కొనసాగుతున్నాయి.. మంగళవారం పెరిగిన రేట్లకే ఇవాళ పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతుండగా.. మరోవైపు నిత్యావసర వస్తువలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. చూడాలి మరి ఇంకా ఈ ధరలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది.

Related posts