telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశ వ్యాప్తంగా డాక్టర్ల సమ్మె.. సుప్రీంకోర్టు లో పిటిషన్..

petition on doctors strike

బెంగాల్ లో పరిస్థితులు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీనితో దేశ వ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేపట్టారు. ఈ సమ్మె పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయ్యింది. తాము విధులు నిర్వహిస్తుండ సమయంలో తమకు రక్షణ కల్పించాలనే డిమాండ్ తో డాక్టర్లు చేపట్టిన సమ్మె అంశాన్ని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని అడ్వకేట్ అలోక్ శ్రీ వాస్తవ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు (జూన్ 18)న ఈ పిటీషన్ పై విచారణ చేపట్టనుంది. వెస్ట్ బెంగాల్‌ లో జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా ఇవాళ(జూన్-17,2019) దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(IMA) పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని ఐఎమ్ఏ తెలిపింది. హాస్పిటల్స్ లో డాక్టర్లు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేసింది.

గుజరాత్ లోని వడోదరాలోని సర్ సయ్యాజీరావ్ జనరల్ హాస్పిటల్ లో ఓపీ డిపార్ట్ మెంట్ బయట డాక్టర్లు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. బెంగాల్ డాక్టర్లపై దాడిని వీరు తీవ్రంగా ఖండించారు. గత సోమవారం కోత్ కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లపై దాడి చేసి గాయపర్చిన విషయం తెలిసిందే. వెస్ట్‌ బెంగాల్‌లో వైద్యుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. హైదరాబాద్ నిమ్స్‌లోనూ వైద్యులు నిరసనలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలను నిమ్స్ వైద్యులు నిలిపి వేశారు. దీనితో.. రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో డాక్టర్ల సమ్మెపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది.

Related posts