telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆర్టికల్ 370 రద్దుపై .. అత్యవసర విచారణకు కోర్టు నిరాకరణ..

petition on 370 rejected for emergency hearing

భారతప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు.. చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో అడ్వొకేట్ ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సరైన సమయంలో దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది.

ఆర్టికల్ 370ని రద్దు చేసే తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు అది రాజ్యసభ ఆమోదం పొందింది. మరుసటి రోజు లోక్ సభ కూడా ఆమోదించింది. అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడిపోయింది.

Related posts