telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ సచివాలయంపై హైకోర్టులో పిటిషన్

Telangana Inter results petition High court

హైదరాబాద్ లోని సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రసుత్తం ఉన్న భవనాన్ని కూల్చేది లేదంటూ 2016లో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసిందని, ఇప్పుడు పాత భవనాన్ని కూల్చి వేసి మళ్ళీ నూతన సచివాలయం నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి, భారీ భవనాలు నిర్మించేందుకు గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించగా పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీంతో సచివాలయంను తరలించమని కోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది. మరోసారి నూతన భవనం తెరపైకి రావడంతో ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం శుక్రవారం పూర్తి వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది.

Related posts