telugu navyamedia
crime news Telangana

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Supreme Court

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.  శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్‌ దాఖలైంది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది.

సుప్రీంకోర్టు 2014 మార్గదర్శకాలను పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేశారు. ఇక నిందితుల మృతదేహాలు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. ఆసుపత్రి ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని

vimala p

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు.. మండలిలో లోకేష్‌ ఫైర్

vimala p

గ్రేటా థన్ బర్గ్ ను చూసి .. ఉడుక్కుంటున్న ట్రంప్.. అందుకే జారి..

vimala p