telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ ఆదాయ పరిమితి పెంచనున్న .. కేంద్రం .. బడ్జెట్ లో కీలకాంశం..

personal income permit may increase in budget

కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,50,000 నుంచి రూ.3,00,000కు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో సుమారు 5 కోట్లమందికి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ చర్య వృద్ధిరేటుపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాక బడ్జెట్‌ లోటుపైనా ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కేంద్ర స్థూల జాతీయోత్పత్తి 3.4 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది.

సెక్షన్‌ 80సి ప్రకారం పొదుపు, పెట్టుబడులపై ప్రస్తుతం ఉన్న రూ.1,50,000 పరిధిని కూడా పెంచేందుకు కసరత్తు చేస్తునట్లు సమాచారం. దీనిపై ఆర్థికశాఖ అధికార ప్రతినిధి డీఎస్‌ మాలిక్‌ స్పందిస్తూ జులై 5వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని, అందువల్ల బడ్జెట్‌కు సంబంధించిన చర్చలన్నీ రహస్యంగా ఉంటాయని పేర్కొన్నారు.

Related posts