telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

వెనక్కి తగ్గిన .. పెప్సీ కో…

pepsi co case on farmers aloo production

పెప్సీ కో కంపెనీ దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనకు దిగడంతో వెనక్కి తగ్గింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను తమ కంపెనీ ఉపసంహరించుకుందని అన్నారు. కాగా, పెప్సీకోకు చెందిన లేస్, చిప్స్ కోసం బంగాళాదుంపపై ఆ సంస్థ పేటెంట్ తీసుకుంది.

పేటెంట్ పొందిన బంగాళాదుంపలను గుజరాత్ రైతులు నలుగురు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సీకో సంస్థ కేసు పెట్టింది. ‘పెప్సీకో’ తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది.

Related posts