రాజకీయ వార్తలు

ఆంధ్రుల ప్రజారాజధాని అమరావతి

భావితరాల కోసం అమరావతి రాజధాని ఆధునిక ప్రణాళికతో రూపుదిద్దుకుంటుంది. 30 శాతం బ్లూ గ్రీన్ తో విశాలమైన రహదారులతో ప్రణాళికాబద్ధంగా నిర్మాణం జరుగుతోంది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మేధావి అని పేరొందిన ఐ వై ఆర్ కు ఈ విషయం తెలియంది కాదు. రాజధాని వ్యతిరేకంగా వ్యూహాత్మక పయనంలో సాగుతున్న ఆయనకు భవిష్యత్ సమాధానం చెబుతుంది. సైబరాబాద్ నిర్మాణ సమయంలోనూ ఇలానే అపనమ్మకాలు, అయిష్టాలు, పెడవివిరుపులు, వెకిలి వ్యాఖ్యానాలు చూశాను. ఒక జర్నలిస్టుగా సైబర్ టవర్స్ నిర్మాణ దశలో ఆప్రాంతానికి స్కూటర్ పై గతుకుల గ్రావెల్ రోడ్లపై వెళ్లి చూసిన నాకు అంతగా నమ్మకం కలగలేదు. అలానే గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీలో ప్లాటులు పొందిన జర్నలిస్ట్ మిత్రులు కూడా అక్కడ ఐసీఐసీఐ, విప్రో, మైక్రో సాఫ్ట్, బిసినెస్ స్కూల్, పెద్ద రహదారులు నిర్మాణ దశలో ఇదంతా అభివృద్ధి చెందుతుందా అని సందేహం వ్యక్తం చేశారు. కానీ పదేళ్లు గడిచాక ఆప్రాంతం రూపు మారింది. అమెరికా వంటి వాతావరణంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది.

అలాగే అమరావతి ఇప్పుడు తొలిదశలో ఉంది. పదేళ్ళలో ప్రజా రాజధాని అన్ని సౌకర్యాలతో మన రాష్ట్రానికి, దేశానికి వరంగా మారడం ఖాయం. ఒక సీనియర్ జర్నలిస్టుగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇది నా నమ్మకం. ప్రజా ఆకాంక్ష. ఎవరు అధికారంలో ఉన్నా అమరావతి ప్రజా రాజధాని సేవలు ఎంతో అవసరం. అందుకే అందరం ప్రజా రాజధాని నిర్మాణానికి సహకరిద్దాం. భావితరాలకు బంగారు భవిష్యత్తు అందిద్దాం.

ఐ వై ఆర్ నల్గొండ కలెక్టర్ గా పనిచేసిన సందర్భంలో ఈనాడు దినపత్రిక జిల్లా ఇంచార్జ్ గా ఎంతో అభిమానించాను. మా జిల్లా వాసి అని ఆనందించాను. ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉద్యోగ విరమణ చేశాక… ఎవరి రాజధాని అమరావతి అని పుస్తకం రాయడం ఆయన విజ్ఞత. దీనికి నా సమాధానం…ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి… అనేది నా నమ్మకం. ప్రజలంతా ఇదే వాస్తవాన్ని ఆకాంక్షించారు. ఆ వాస్తవ రూపం అందరికీ దక్కుతుంది. ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేసినా అమరావతి చరిత్రలో సుప్రసిద్ధ నగరంగా విలసిల్లుతుంది. విజ్ఞులందరికీ ఒకటే విన్నపం. ప్రజా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి. భావితరాలకు బంగారు భవిష్యత్ అందించండి.

వై.హనుమంతరావు

Related posts

కేసీఆర్‌ పెట్టుకునే దిక్కుమాలిన సభకు నిబంధనలు ఉల్లంఘిస్తారా: రేవంత్‌ రెడ్డి

madhu

జడ్జి ఆత్మహత్య…అనారోగ్యమే కారణం…తిరుపతిలో ఘటన..

chandra sekkhar

వైసీపీకి టీడీపీ మద్దతు: బాబు సంచలన నిర్ణయం

admin

Leave a Comment