telugu navyamedia
సినిమా వార్తలు

ఒక్క రాత్రికి కోటి రూపాయలు… హీరోయిన్ కామెంట్స్ 

Sakshi Chowdary
పోటుగాడు, జేమ్స్‌బాండ్, సెల్ఫీరాజా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సాక్షి చౌదరి. అయితే ఈ నటి సినిమాలకంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు ఎక్కువగా దగ్గరైందని చెప్పొచ్చు. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా తనకు ఒక రాత్రికి వస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తామంటూ కొందరు ఆఫర్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రికి వస్తావా ? రేటెంత ? అంటూ వేధిస్తున్నారని తెలిపింది.
తన హాట్ ఫొటోలతో ప్రేక్షకులను ఉత్సాహపరచడమే తన పని అని, కానీ తనకు రేటు కట్టడమే బాధాకరమని, నటి అయినంత మాత్రాన చులకనగా చూడడం తగదని, తనకు ఇలాంటి ఆఫర్ చేసేవారు మూర్ఖులని, మరోసారి తనకు ఎవరైనా ఇలాంటి పిచ్చిపిచ్చి ఆఫర్లు చేస్తే వారి బండారాన్ని సాక్ష్యాలతో సహా బయటపెడతానని ఆగ్రహం వ్యక్తం చేసింది సాక్షి.  

Related posts