telugu navyamedia
రాజకీయ

మాయావతి జన్మదిన వేడుకలు.. కేకు కోసం ఎగబడ్డ జనాలు

Mayawati Welcomes Reservation To Upper Castes
ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన 63వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోరాలో జరిగిన వేడుకల్లో పార్టీ నిర్వాహకులకు ఊహించని ఘటన ఎదురైంది. ఒక్క కేక్ ముక్క కోసం జనాలు ఎగబడ్డారు.  ఒకరి తర్వాత ఒకరు  తీసుకోవాలని నిర్వాహకులు చెప్పినప్పటికీ ఎవరు వారి మాటను వినిపించుకోలేదు.
Video Source: ANI
కేకు కోసం పెద్ద సంఖ్యలో జనాలు తోసుకున్నారు. ఎవరికి వారు చేతులు పెట్టి కేక్ లాక్కోవడంతో అది చితికిపోయింది. కేకు ముక్క దొరికిన వారు ఆదరబాదరగా లాగించేశారు. క్షణాల్లో కేకును దొరకకుండా ముక్కులు చేసి అక్కడి నుండి జారుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts