telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఛపాక్ సినిమా ఎఫెక్ట్‌.. యాసిడ్ బాధితులకు పెన్షన్ .. యూపీ ప్రభుత్వం …

pension to acid attacked in UP State

యూపీ ప్రభుత్వం యాసిడ్ బాధితులకు పెన్షన్ అందిస్తామంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే ఛపాక్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇందులో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ చిత్రంపై తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది.

ఈ చిత్రంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. దీపికపై ప్రసంసలు కురించారు. అలాగే.. యాడిస్ బాధితులకు గుడ్‌న్యూస్ ప్రకటించారు. వారు సగౌరవంగా బతికేందుకు ప్రతీ నెల పించన్‌ ద్వారా రూ.5 వేల నుంచి రూ. 6000లు అందిస్తామని వెల్లడించారు. దీనిపై కేబినేట్‌లో కూడా చర్చించి… పక్కా అమలయ్యాలే చూస్తామన్నారు. కాగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఈ సినిమాకి ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌ని మినహాయించింది. కాగా ఇటీవల 32వ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ని యాసిడ్‌ దాడిలో గాయపడిన మహిళలతో కలిసి లక్నోలో జరుపుకున్న విషయం విదితమే.

Related posts