telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి నీ నటన అద్భుతం… “పెంగ్విన్” చిత్రంపై రష్మిక రివ్యూ

Rashmika

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “పెంగ్విన్”. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పేట’ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోకి కూడా ఈ సినిమాను అనువాదం చేశారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో జూన్ 19న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ సినిమాను వీక్షించిందట. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. “గత రాత్రి నేను `పెంగ్విన్` సినిమా చూశాను. కీర్తి సురేష్.. ఎప్పటిలాగానే నీ నటన అద్భుతం. ఈ సినిమాతో తల్లులందరూ కనెక్ట్ అవుతారు. సినిమా ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్, కార్తీక్ సుబ్బరాజ్, ఇతర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్” అంటూ రష్మిక పేర్కొంది.

Related posts