telugu navyamedia
political

కోస్తా తీరంలో పెథాయ్ బీభత్సము… భారీ వర్షాలు

fedai cyclone effect in ap

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’ ఆంధ్రప్రదేశ్‌లో విలయతాండవం సృష్టిస్తోంది. దీని కారణంగా కోస్తా తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి, ఆదివారం సాయంత్రం నుంచి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న 24 గంటల్లో పెథాయ్ పెను తుఫానుగా మారనున్న నేపథ్యంలో కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎనిమిది తీర మండలాలను అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలపై పెథాయ్ విరుచుకుపడే అవకాశం ఉంది. అలలు భారీగా ఎగిసిపడుతుండటంతో కాకినాడ-తుని రోడ్డుపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మొత్తం 295 ప్రాంతాలు పెథాయ్ ప్రభావానికి గురవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లిన 200 పడవలను అధికారులు వెనక్కి తెప్పించారు. మరోవైపు పెథాయ్‌ గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… అధికారులను అప్రమత్తం చేశారు.

హుధుద్, తిత్లీ సహా వివిధ తుఫాన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జనరేటర్లు, మంచినీరు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మరోవైపు తుఫాను తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, బలమైన గాలులు వీచే అవకాశమున్న ప్రాంతాల్లో చెట్ల కింద నిల్చోరాదని సూచించింది.



పెథాయ్ తుఫాను ప్రభావంతో రద్దయిన రైళ్ల వివరాలు

పెథాయ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. దీని ప్రభావం రవాణా సౌకర్యాలపైనా పడింది. తుఫాను కారణంగా ట్రాకులు దెబ్బతినే అవకాశం ఉందని భావించిన దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు సోమవారా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అంతేకాకుండా తుఫాన్ దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. పట్టాల వెంబడి నిరంతరాయంగా గస్తీని కొనాసాగించాలని.. విజయవాడ, గుంటూరుల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు:
1.విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
2.రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్‌
3.విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్‌
4. కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్‌
5. విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
6. తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
7. గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్‌
8. తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్‌
9. విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
10తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
11. విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
12. విజయవాడ-కాకినాడ పోర్ట్‌, మెము ప్యాసింజర్‌
13. రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
14. భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్‌
15. రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
16. భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్‌
17. నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్‌
18. భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్‌
19. రాజమండ్రి-నర్సాపూర్‌, డెము ప్యాసింజర్‌
20. నర్సాపూర్‌-గుంటూరు, డెము ప్యాసింజర్‌
21. గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్‌
22. విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్‌

Related posts

లక్ష్మీనారాయణను కలిసిన టిడిపి మంత్రి.. రేపు చంద్రబాబుతో భేటీ కానున్న మాజీ జేడీ ?

ashok

ఈసీ అధికారుల పై కుమారస్వామి ఆగ్రహం

vimala p

రైతుని పెళ్లాడితే.. లక్ష రూపాయల బహుమతి..

vimala p