telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

పెద్దమ్మ తల్లి .. శాకాంబరీ ఉత్సవాలు ..

peddamma talli sakambari ustav

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో కొలువైన అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ తల్లి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాడమాసం వచ్చిదంటే చాలు పెద్దమ్మతల్లి శాకాంబరీదేవిగా భక్తులకు దర్శమిస్తుంది. ఈ సందర్భంగా దేవాలయం అంతా కూరగాయాలు, పండ్లు, ఆకుకూరలతో నిండిపోయింది. అన్ని రకాల కూరగాలతో దేవాలయాలన్ని అత్యంత శోభాయమానంగా అలకరించారు. ప్రతియేటా అషాఢ మాసంలో నిర్వహించే శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా నిన్న తెల్లవారుజామున పెద్దమ్మతల్లికి అభిషేకం నిర్వహించి..హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను ఆలయ పూజారులు అంత్యం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు.

ఆలయ ట్రస్టీ విష్ణు వర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, పంచగవ్వ ప్రాశన, ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శాకాంబరీ అవతారంలో కొలువుతీరిన పెద్దమ్మతల్లిని దర్శించేందుకు నగరం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శాకాంబరీ ఉత్సవాల్లో రెండోరోజైన ఈ రోజు ఉదయం 10 గంటలనుంచి సామూహిక శ్రీ లలితా సహస్రనామ కుంకు మార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు.

Related posts