telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత వీసా సమస్య పై మరోసారి ఐసీసీ వద్దకు పాక్…

pcb

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 2020 లో జరగాల్సిన ఆసియా కప్ కు హోస్టింగ్ బాధ్యతలు దక్కించుకుంది. అయితే పాక్ లో జరిగే ఆ టోర్నీకి తమ ఆటగాళ్లను పంపించడం కుదరదని మరెక్కడైనా దానిని నిర్వహిస్తేనే మా జట్టును పంపిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ముందు కుదరదు అని చెప్పిన తర్వాత ఒప్పుకొని ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించడానికి సిద్ధమైంది పీసీబీ. కానీ కరోనా ప్రస్తుతం అది వాయిదా పడింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచ కప్, 2023 లో జరగాల్సిన వన్డే ప్రపంచ కప్ లకు మన బీసీసీఐ ఆతిధ్యం ఇవ్వనుంది. అయితే మా దేశంలోకి రావడానికి ఒప్పుకోనివారు మమ్మల్ని తమ దేశంలోకి రాణిస్తారా… అనే సందేహం పీసీబీ వ్యక్తం చేసింది. ఈ విషయం పై ఇప్పుడే ఐసీసీ ని సంప్రదించిన పీసీబీ భారత్ కు వీసాలు పొందడంలో తమ జట్టుకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని బీసీసీఐ నుండి లిఖితపూర్వక హామీలు ఇప్పించాలని ఐసీసీ ని కోరింది. అయితే చూడాలి మరి ఐసీసీ, బీసీసీఐ ఈ విషయం పై ఏ విధంగా స్పందిస్తాయి అనేది.

Related posts