telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముక్కుసూటితనం వల్ల ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నా : శృతి హాసన్

Shruthi

కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సౌత్ హీరోయిన్ శృతి హాసన్. ఆమె నటి మాత్రమే కాదు… గాయని, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేసి అందులో తన సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తోంది. మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పని చేసిన శృతి ఆ తరువాత హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో అనేక సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే, వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో సడెన్ గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైనా శృతి హాసన్ తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా క్రాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా అభిమానులతో సోషల్‌మీడియా ద్వారా ఇంటరాక్ట్‌ అయిన శృతి హాసన్ సినీ పరిశ్రమపై వస్తున్న ఆరోపణలు, వివాదాలపై తనదైన శైలిలో స్పందించింది. ప్రతి రంగంలోనూ మంచి చెడు రెండూ ఉంటాయని, అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీనే అందరూ వేలెత్తి చూపడం సరికాదని అభిప్రాయపడింది. “నాకు మొహమాటం లేకుండా, ముక్కసూటిగా మాట్లాడటం అలవాటు. ఎదుటి వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే క్యారెక్టర్ నచ్చకపోతే నేను లెక్క చేయను. మనసులో ఎలా అనిపిస్తే అలా పైకి మాట్లాడేస్తూ ఉంటా. ఆ ధోరణి వల్లే ఎన్నో సినిమా అవకాశాలు పోగొట్టుకున్నా. అలాగని అవకాశాలు లేవని ఏడుస్తూ కూర్చోలేదు. ఏ రంగంలోనైనా ఇలాంటి పరిస్థితి సాధరణమే. కార్పోరేట్ రంగంలోనూ చాలామంది మహిళలు ఉన్నతాధికారుల వద్ద ముక్కుసూటిగా ఉంటూ ఉద్యోగాలు కోల్పోయిన వారున్నారు. నేను ఎంత కష్టంలో ఉన్నా వ్యక్తి్త్వాన్ని మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయలేదు” అని శృతి చెప్పుకొచ్చింది. కమల్‌ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాను తొలి దశలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని శృతి తెలిపింది.

Related posts