telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐదుగురు క్రిమినల్స్ ఉన్న జైల్లో పెట్టారు నన్ను… : నటి ఆవేదన

Payal-Rohatgi

నెహ్రూ, గాంధీ కుటుంబాలపై సోషల్‌మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేశారన్న ఆరోపణల కేసులో బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గీని రాజస్థాన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబసభ్యులను దూషిస్తూ పాయల్ రోహత్గి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి చర్మేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు అక్టోబర్‌ 10న బుండి పోలీస్‌స్టేషన్‌లో పాయల్ పై ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. డిసెంబర్ 16న బుండి కోర్టు పాయల్ కు 8 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ కేసులో పాయల్ కు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల బాండ్ తో ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరవగా..పాయల్ జైలు నుంచి విడుదలైంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన పాయల్ తనను దారుణమైన జైల్లో పెట్టారంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. “ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అసలు నేనేం చేశానని నాకు ఇలా జరిగింది. అహ్మదాబాద్‌లో ఉన్న నన్ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు నన్ను ఓ దరిద్రమైన సెల్‌లో పెట్టారు. ఆ తర్వాత ఐదుగురు క్రిమినల్స్ ఉన్న జైల్లో పెట్టారు. ఆ చలిలో నేల మీదే పడుకోబెట్టారు. రాత్రంతా నరకం అనుభవించా. మరో రాత్రి గడిపి ఉంటే నేను బతికుండేదాన్నో లేదో తెలీదు. నా భర్త చాలా అమాయకుడు. చట్టం రూల్స్ ఏంటో మాకు తెలీదు. అందుకే రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయగలిగారు. ముందే నోటీసులు పంపామని, నేను రిప్లై ఇవ్వలేదని అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి నేను జైలు నుంచి బయటకు వచ్చాను. ఈ ఘటనను నేను అస్సలు మర్చిపోలేను. మళ్లీ ఇలాంటి అనుభవం నాకు ఎదురుకాకూడదని అనుకుంటున్నాను. మీడియా నాకు సపోర్ట్ చేసిందనే అనుకుంటున్నాను” అని తెలిపారు.

Related posts