telugu navyamedia
సినిమా వార్తలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పాయల్ రాజ్ పుత్

payal rajput

“ఆర్ఎక్స్ 100” సినిమా తరువాత పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో భారీ క్రేజ్ వచ్చింది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నప్పటికీ మంచి ప్రాధాన్యమున్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ అగ్రహీరోలకు జతగా అవకాశం దక్కించుకున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో నెటిజన్లకు నిద్ర కరువయ్యేలా చేస్తోంది. దర్శకుడు వంశీకృష్ణ “టైగర్ నాగేశ్వరరావు” బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. దొంగతనాలు చేయడంలో మంచి నేర్పరి. పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. 1980-90లలో స్టువర్టుపురం గజదొంగగా “టైగర్ నాగేశ్వరరావు” ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆయన బయోపిక్ లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు. ఈ సినిమాలో వేశ్య పాత్రలో పాయల్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అక్క పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుందనే టాక్ వుంది.

Related posts